Tuesday, 29 October 2013

Vasthaadu naa naju ee roju song telugu lyric

Movie Name:అల్లూరి  సీతారామరాజు 
Song Title:వస్తాడు నా  రాజు  ఈ  రోజు 
Singers:సుశీల. పి 
Lyricist:నారాయణ రెడ్డి  C
Music Director:అది నారాయణ రావు 
Actors :
కృష్ణ , విజయనిర్మల



వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తెలి వస్తాడు నా రాజు ఈ రోజు

వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలీ వినిపించేను
ఆతని పావన పాద ధూళికై
అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే
పాల సంద్రమై పరవశించేను
పాల సంద్రమై పరవశించేను
వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెల లెంతగా విరిసిన గాని
చంద్రున్ని విడి పోలేవూ ఓ ఓ
కెరటాలెంతగా పొంగినగాని
కడలిని విడి పోలేవూ ఓ ఓ
కలసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకూ విడి పోలేవులే ఓ ఓ
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే నిలిచేనులే
వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
వస్తాడు నా రాజు ఈ రోజు

1 comment: