Monday, 28 October 2013

Ninnu Chudagane Chiti Gunde Song Lyric

Movie Name:Attarintiki Daredi
Song Title:Ninnu Chudagane
Singers:Devi Sri Prasad
Lyricist:Devi Sri Prasad
Music Director:Devi Sri Prasad

నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హో అదేమిటే
నిన్ను చూడకుంటె రెండు కళ్లు
ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్
ఓయ్ ఆ ఆ ఏ అవతలకి పో

నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు
ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిధలా చంపావే మరదలా
నిన్ను చూడగానే నా చిట్టి గుండె
నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు
ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

వన్స్ మోర్ విత్ ఫీల్
ఓహ్ నో

ఏ అంత పెద్ద ఆకాశం
అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావె
ఇరగదీసావే
ఏయ్ భూమిలోన బంగారం
దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ
ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే
ఏ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె
చీమలా నేను వెంట పడనా
నావలా నువ్వు తూలుతూ నడుస్తు ఉంటె
కాపలాకి నేను వెంట రానా
కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా
నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై

ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం
ం అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆ హుం ఆ హుం
హోయ్ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాల మీద మీగడేదమ్మా
హా వేడి పాలలోన వెన్న లేదమ్మా 
ఆ హుం ఆ హుం

ప్లీజ్ డ్యాన్స్ యార్

మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీస అందాన్ని చూడనే లేదు
ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే
దాగిఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె
నేను మాత్రమెంతని పొగిడి పాడగలను
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా
ముద్దుగున్నావె మరదలా
నిన్ను చూడగానె నా చిట్టి గుండె
నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు
ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

No comments:

Post a Comment