Movie Name | : | గీతాంజలి |
Song Title | : | జల్లంత కవ్వింత కావాలిలే |
Singers | : | చిత్ర |
Lyricist | : | వేటూరి సుందరమముర్తి |
Music Director | : | రాజన్ నాగేంద్ర |
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు బొండుమల్లె తేనేనొక్క ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వాన దేవుడే కళ్ళాపి జల్లగా
వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో హో హో
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
జల్లంత కవ్వింత కావలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే